Blog

సినీ కార్మికుల కోసం మెగా ఈ-శ్రమ్ నమోదు శిబిరం-ప్రముఖ సినీ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు

(విశాఖపట్నం-మీడియావిజన్ ఏపీటీఎస్ ప్రత్యేక ప్రతినిధి )

( డిశంబర్ 19 )

ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమలోని కళాకారులు, ఉద్యోగులు, కార్మికుల కోసం ఈనెల 31న మెగా ఈ-శ్రమ్ నమోదు శిబిరరం నిర్వహిస్తున్నట్టు ఏపీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత, ప్రముఖ సంఘసేవకులు, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు తెలియజేశారు. బుధవారం ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ , విశాఖలోని అల్లూరి విజ్నాన కేంద్రంలో ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ శిబిరం కొనసాగుతుందన్నారు. విశాఖతోపాటు చుట్టుప్రక్కల ప్రాంతాల సీని కార్మికులంతా తరలి వచ్చి ఈ-శ్రమ్ కార్డుల కోసం వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు. కేంద్రప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ కార్డు ద్వారా ఎన్నో ఉపయోగాలు, ఇన్స్యూరెన్స్ కూడా నమోదు చేయించుకున్నవారికి కవర్ అవుతాయన్నారు. రానున్న రోజుల్లో ఈ-శ్రమ్ కార్డులు సీనికార్మికులు, సిబ్బందికి 24 ఫ్రేమ్స్ లో పనిచేసే సిబ్బందికి ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సినిమా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు, పరిశ్రమను విశాఖ తరలించడానికి చక చకాగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమను విశాఖ తరలించాలని కోరుతూ కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని కలిసి వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారను. భారత దేశంలో ఉన్న వారికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యంగా ఈ-శ్రమ్ కార్డు కూడా ఉండాలని డా. కంచర్ల సూచించారు. విశాఖనగరానికి చెందిన సినీ, టీవి కళాకారులు, కార్మికులు తప్పనిసరిగా ఈ-శ్రమ్ కార్డులు పొందాలనే లక్ష్యంతోనే ప్రత్యేకంగా నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు డా.కంచర్ల అచ్యుతరావు వివరించారు.

Related Articles

Back to top button