సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కారం చేయాలనే దృక్పథంతో మీకోసం కార్యక్రమం – జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు
కృష్ణాజిల్లా జులై 29: (మీడియా విజన్ ఏపీటీఎస్ )
_ప్రజలు ఎదుర్కొనే సమస్యను చట్ట పరంగా పరిష్కరించి, న్యాయం అందించడానికి కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “*మీకోసం*- ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ .గంగాధరరావు అన్నారు . ఈరోజు జిల్లా నలుమూలల నుండి ప్రజలు *మీకోసం* కార్యక్రమంలో వారి సమస్యలను గూర్చి ఫిర్యాదు చేయగా వారి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి మీ సమస్యలు చట్టపరిధిలో విచారణ జరిపి, నిర్ణీత సమయంలోపల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫోన్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అంతేకాక ప్రజలకు ప్రతి సోమవారం అందుబాటులో ఉండి వారి సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారం అందించే దిశగా కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఈరోజు స్పందన కార్యక్రమానికి మొత్తం 35 ఫిర్యాదులు అందాయి. ఆ సమస్య తీవ్రత ఆధారంగా సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు_*_ఈరోజు అందిన ఫిర్యాదులలో_*1. తాళి కట్టిన భర్త తోడుగా ఉంటాడనుకుంటే అదనపు కట్నం కోసం వేధిస్తూ మరొక వివాహానికి సిద్ధమవుతున్నాడని న్యాయం చేయాలని పెనమలూరు నుండి ఒక వివాహిత ఫిర్యాదు.2. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓడ్చి డిగ్రీ వరకు చదువుకున్నానని, దగ్గర బంధువుల్లో ఒకరు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తమ వద్ద నుండి డబ్బులు వసూలు చేసి ఉద్యోగం గూర్చి సమాధానం ఇవ్వడం లేదని మోసపోయానని న్యాయం చేయమని అవనిగడ్డ నుండి ఒక యువకుని ఫిర్యాదు.3 . కడుపున పుట్టిన కన్న బిడ్డలకు తమను పోషించడం భారంగా మారిందని, అందువల్ల ఇంటిలో కూడా ఉండనివ్వకుండా బయటకు గెంటివేసారని, నిలువ నీడ లేక అల్లాడుతున్నామని న్యాయం చేయమని గుడివాడకు చెందిన ఒక వృద్ధుని ఫిర్యాదు