Blog

చిత్ర పరిశ్రమకు అనువైన ప్రాంతం ఉత్తరాంధ్ర……జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు

విశాఖపట్నం ఆగస్టు 20: (మీడియావిజన్ ఏపీటీఎస్ సాంసృతిక విభాగం )

సినీ కళాకారుల సమస్యల పరిష్కారానికి, వారికి చిత్రాలలో అవకాశాలకు ప్రోత్సహించేలా తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (టీమా) పనిచేయాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. చిత్ర సీమకు అనువైన ప్రాంతంగా ఉత్తరాంధ్ర పేరు పొందిందని పేర్కొన్నారు. విశాఖ నగరంలో అక్కయ్యపాలెం, జగన్నాధపురంలో తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉత్తరాంధ్ర కార్యాలయాన్ని గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కళాకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమకు పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అనేక మంది కళాకారులు సినీ పరిశ్రమలో ఉన్నత స్థానాలలో ఉన్నారన్నారు. కొత్తగా సినీ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్న ఉత్తరాంధ్ర కళాకారులను స్థానిక సినీ అసోసియేషన్ లు సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించి అన్ని హంగులతో ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పి.వెంకట్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ బెల్లం జయ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.కృష్ణకిషోర్ లతో పాటు ఇతర ప్రతినిధులను గంట్ల శ్రీనుబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఉపాధ్యక్షులు పాండురంగ విటల్, ఒంగోలు ఉపాధ్యక్షులు సతీష్, సంయుక్త కార్యదర్శి ఆర్.ఎం.కే.శర్మ, కార్యనిర్వహక కార్యదర్శిలు రమేష్ యాదవ్, వెంకట్, విజయనగరం జిల్లా అధ్యక్షులు గద్దె వరప్రసాద్, లీగల్ అడ్వైజర్స్ మోది రాజేశ్వరరావు, ఈశ్వర్ చంద్రశేఖర్, విశ్రాంతి పోలీస్ అధికారి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Related Articles

Back to top button