నర్సీపట్నం ఆగస్టు 25: మీడియావిజన్ ఏపీటీఎస్
పోలీసులు, జర్నలిస్టుల నడుమ సోదర బంధం ఉండాలని నర్సీపట్నం సీఐ హరి అన్నారు. ఆదివారం గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పోలీసులు, జర్నలిస్టుల వృత్తి సవాళ్లు తో కూడుకున్నదని అన్నారు. సమగ్ర సమాచారం, అధికారుల వివరణతో వార్తలు ప్రచురిస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని అన్నారు. యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు మహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల గట్టిగా పోరాడుతున్న ఏకైక యూనియన్ ఫెడరేషన్ మాత్రమేనని అన్నారు. అనకాపల్లి జిల్లాలో అతి తక్కువ మంది సభ్యులతో ప్రారంభం అయిన ఫెడరేషన్ నేడు జిల్లాలో అతి పెద్ద యూనియన్ గా అవతరించడం అభినందనీయమని, ఇందుకు జిల్లా అధ్యక్షుడు బి. వెంకటేష్, ప్రధాన కార్యదర్శి… రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ఈశ్వరరావు కృషి ఎంతో ఉందని అన్నారు. విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ యూనియన్ ను బలోపేతం చేయడమే కాకుండా అనేక జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ఈశ్వరరావు మాట్లాడుతూ వచ్చే నెల మొదటివారంలో అనకాపల్లిలో జిల్లా మహాసభలు జరుగుతాయని, జిల్లా కార్యవర్గ ఎన్నికలు కూడా జరుగుతుందని, యూనియన్ బలోపేతానికి కృషి చేద్దామని ఆశక్తి ఉన్నవారు ముందుగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు తెలియచేయాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి. వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో…. నర్సీపట్నం ప్రెస్ క్లబ్ కార్యదర్శి రాజు, గొలుగొండ ఎస్సై కృష్ణారావు, ఎల్లవరం సర్పంచ్ రాంబాబు, జీడిగుమ్మల ఎంపీటీసీ అప్పలనాయుడు, సౌజన్యం పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కొండలరావు, నర్సీపట్నం జర్నలిస్టులో ఖాదర్ శ్రీధర్, రమణతోపాటు పలు మండలాలకు చెందిన జర్నలిస్టులు హాజరయ్యారు.