అమరావతి: (మీడియావిజన్ ఏపీ టిఎస్ ప్రత్యేక ప్రతినిధి )
గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరముందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్ వన్‌గా ఉంటాం. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కనబెట్టారు.. బ్లాక్ మెయిల్ చేశారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్రా అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారని చంద్రబాబు అన్నారు.