జాబ్ మేళాతో యువతకు ఉద్యోగ అవకాశాలు… జాబ్ మేళా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సృజనా చౌదరి అభినందనీయుడు…. బీసీ జాతీయ నాయకుడు కర్రి వేణు మాధవ్
విజయవాడ (ఆగస్టు 10):మీడియా విజన్ ఎపీటీఎస్ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఏర్పాటు తర్వాత విజయవాడ నియోజకవర్గ పరిధిలో పశ్చిమ శాసనసభ్యుడు యలమంచిలి సృజనా చౌదరి జాబ్ మేళా ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిన విషయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జ్ కర్రి వేణు మాధవ్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పరిస్థితి ఫీల్ గుడ్ ప్రశాంతమైన పరిపాలన ప్రారంభమైందని పింఛన్లు ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంచడంతో అందరిలోనూ సంతోషము ఆనందంగా పించను దారులు ఉన్నారన్నారు.దేవాలయాలకు నిర్వహణ కోసం 5000 నుంచి పదివేలకు పెంచడంపై ప్రత్యేక అభినందనలు తెలిపారు.మద్యం పాలసీ పాత ప్రభుత్వం మూడు నెలల వరకు ఉంచిన స్టాక్ వల్ల అక్టోబర్ 1 నుండి నూతన పాలసీ విధానం అమలు చేస్తారని విధాన ప్రకటన చేయడం అభినందనీయమని వీలైనంతవరకు ప్రజలందరూ కూటమి ప్రభుత్వం నుండి కోరుకున్నవన్నీ జరుగుతాయని హర్షం వ్యక్తం చేశారు.మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టి 2500 మంది వరకు పాల్గొనడం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చరిత్రలో గొప్ప విషయమని ఈ ఘనత ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి గారికి దక్కిందన్నారు.ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నియోజకవర్గంలో ఆయన కేంద్రంగా నిలుస్తారని ఆశాభావాన్ని వేణుమాధవ్ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిసి నాయకులు విజయవాడ బీసీ యవజన విభాగం నగర అధ్యక్షుడు పెంట సాయికిరణ్ జెటి మల్లికార్జునరావు తోలేటి సురేషు గోలి మురళి నల్లూరి అశోక్ కుమార్ దాస్ మీర్జా అక్బర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.