Blog

శ్రీ యశోదకృష్ణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం

శ్రీ యశోదకృష్ణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం ఆదివారం శివాజీపార్క్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ముద్దాడ ఎల్లాజీరావు, ప్రధాన కార్యదర్శి బీసపు శ్రీను లు మాట్లాడుతూ ఈ సంఘం ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు అయినా సందర్భంగా ప్రతి ఒక్క సభ్యులు ఈ సంఘాన్ని అభివృద్ధి పరంగా బలోపేతం చేసే విధంగా తోడ్పడాలని సభ్యులను వారు కోరారు. సంఘం అభివృద్ధితో పాటు పలు సూచనలు, సలహాలు వారు తెలియజేశారు. సభ్యులు దగ్గర వారి వారి సూచనలు, సలహాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాబోయే కృష్ణాష్టమి వేడుకలు గురించి చర్చించి ఒక నిర్ణయం మెరుపు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పిల్లల మోహనరావు, ముఖ్య సలహాదారులు ముద్దాడ శంకర్రావు, జోగ శ్రీనివాస్, ఓమ్మి ఆనంద్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button